'వైల్డ్‌డాగ్'తో పాటు హిందీలో పలు హిట్ సినిమాలు చేసిన హీరోయిన్ దియా మీర్జా.. మగబిడ్డకు జన్మనిచ్చింది. మే నెలలో తనకు చిన్నారి పుట్టినప్పటికీ, బుధవారం(జులై 14) ఆ విషయాన్ని వెల్లడించింది. అతడికి 'అవ్యాన్ ఆజాద్ రేఖీ' పేరు పెట్టినట్లు చెబుతూ, జన్మించినప్పటి నుంచి చిన్నారి ఐసీయూలోనే ఉన్నాడని పేర్కొంది.
ప్రస్తుతం బాబు క్షేమంగానే ఉన్నాడని, త్వరలో ఇంటికి తీసుకురానున్నామని దియా ఇన్‌స్టాలో సుధీర్ఘమైన పోస్ట్‌లో వెల్లడించింది. చిన్నారి ఫొటో షేర్ చేసిన సందర్భంగా ఆమెకు అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.