తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆ సమయంలో మరణం అంచుల వరకు వెళ్లొచ్చా' - దియా మీర్జా లేటెస్ట్ న్యూస్

Dia Mirza Pregnancy: గతేడాది తన జీవితంలో ఎదురైన అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు బాలీవుడ్ నటి దియా మీర్జా. తన పెళ్లి నుంచి ప్రసవ సమయంలో మరణం అంచుల వరకు వెళ్లొచ్చిన సంఘటనలన్నింటిని నెమరు వేసుకుంటూ.. ఓ వీడియో చేశారు. దాన్ని ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేశారు.

Dia Mirza opens
Dia Mirza opens

By

Published : Jan 11, 2022, 1:15 PM IST

Dia mirza Pregnancy: పర్యావరణమంటే ప్రాణమిచ్చే బాలీవుడ్​ నటి దియా మీర్జా.. 2021లో తన జీవితంలో ఎదురైన అద్భుత సంఘటనలు, సమస్యలను వివరిస్తూ ఓ వీడియో చేశారు. ఆ వీడియోను తన ఇన్​స్టా పేజీలో షేర్​ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త వైభవ్‌ రేఖిని వివాహం చేసుకోవడం నుంచి మహమ్మారి సమయంలో వారి మొదటి బిడ్డకు జన్మనివ్వడం.. అదే సమయంలో మరణం అంచులవరకు వెళ్లి రావడం వరకు అన్ని విషయాలను నెటిజన్లతో పంచుకున్నారు. 2021ను అమ్మతనంతో ముగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

"అమ్మతనంతో 2021 ముగిసింది. ఇదో అద్భుతమైన సంఘటన. మరణం అంచుల వరకు వెళ్లొచ్చిన అనుభవం. నా బిడ్డ పుట్టుక, కొన్ని కఠిన పరీక్షలతో గడిచిపోయింది. వాటి నుంచి ఎన్నో గుణ పాఠాలు నేర్చుకున్నా. ఇక క్లిష్టమైన సమయాలు ఉండవని భావిస్తున్నా."

- దియా మీర్జా, బాలీవుడ్​ నటి

మరణం అంచుల వరకు..

రేఖితో వివాహం తర్వాత రెండు నెలలకు దియా గర్భం దాల్చింది. అయితే గర్భిణిగా ఆరోనెల గడుస్తున్న సమయంలో ఆమె తీవ్ర బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌కు గురైంది. దీంతో అత్యవసరంగా అపెండెక్టమీ (అపెండిసైటిస్‌ శస్త్రచికిత్స) చేయాల్సి రావడం వల్ల.. డాక్టర్లు సిజేరియన్‌ చేసి బిడ్డను బయటికి తీశారు. అయితే ఆ సమయంలో మరణం అంచులవరకు వెళ్లి వచ్చినట్లు అనిపించిందని తన అనుభవాన్ని పంచుకుందీ అందాల తార. అలాగే తనను, తన బిడ్డను కాపాడిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపింది.

మహిళా పురోహితురాలి సమక్షంలో దియా పెళ్లి

గతేడాది ఏడాది ఫిబ్రవరిలో ప్రముఖ వ్యాపారవేత్త వైభవ్‌ రేఖితో ఏడడుగులు వేసింది దియా. తన పెళ్లిలో ఆద్యంతం పర్యావరణహిత ఉత్పత్తులకు ప్రాధాన్యమిచ్చిన ఆమె.. మహిళా పురోహితురాలి సమక్షంలో మనువాడి సంచలనం సృష్టించింది. దియా మీర్జా తన వివాహ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఆ విషయం తెలిసి అప్పట్లో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. తన స్త్రీవాదాన్ని చాటూతూ దియా మీర్జా చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

ఇదీ చూడండి:'నేరం నేను చేయకపోయినా కించపరుస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details