దేశం కోసం పోరాడుతున్న పోలీసు అధికారి భార్య పాత్రలో నటించడం ఎంతో గర్వంగా ఉందని ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా అన్నారు. తెలుగులో తొలిసారిగా అక్కినేని నాగార్జునతో కలిసి 'వైల్డ్‌డాగ్' చిత్రంలో ఆమె నటించారు. ఏప్రిల్ 2న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా ఈటీవీ భారత్‌తో దియా మీర్జా ప్రత్యేకంగా ముచ్చటించారు.
ప్రియావర్మ పాత్ర ఎంతో మంది వీర జవాన్ల కుటుంబాల్లోని మహిళలకు ప్రతిబింబంగా ఉంటుందని ఆమె తెలిపారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగార్జునను చూడటం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్న దియా మీర్జా.. నాగ్‌తో కలిసి నటించడం చెప్పలేని అనుభూతిని మిగిల్చిందన్నారు. చిత్ర కథలో తన పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు.