ప్రముఖ హీరోయిన్ దియా మీర్జా వివాహం బిజినెస్‌మ్యాన్ వైభవ్ రేఖితో ఘనంగా జరిగింది. ముంబయిలో సోమవారం రాత్రి ఈ వేడుక నిర్వహించారు. దీనికి ఇరుకుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి తర్వాత మీడియా ముందుకొచ్చిన వైభవ్-దియా.. ఫొటోలకు ఫోజులిచ్చారు.
గతంలో సినీ నిర్మాత సాహిల్ సంగాతో దియా పెళ్లి జరిగింది. వ్యక్తిగత మనస్పర్ధల కారణంగా 2019లో వీరిద్దరూ విడిపోయారు. వైభవ్ కూడా తన మొదటి భార్యకు విడాకులిచ్చి దియాను మనువాడారు.