తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఏడ్చేసిన బాలీవుడ్ హీరోయిన్.. ఆ వార్తే కారణం - entertainment news

నటి దియా మీర్జా భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేకపోయింది. లిటరేచర్ ఫెస్టివల్​లో భాగంగా మాట్లాడుతూ, కన్నీటి పర్యంతమైంది. అనంతరం అందుకు గల కారణాన్ని చెప్పింది.

Dia Mirza Breaks Down At Jaipur Literature Festival
హీరోయిన్ దియా మీర్జా

By

Published : Jan 28, 2020, 12:43 PM IST

Updated : Feb 28, 2020, 6:37 AM IST

బాలీవుడ్​ నటి దియా మీర్జా.. వేదికపై మాట్లాడుతూ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమైంది. జైపుర్​లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్​లో భాగంగా వాతావరణ మార్పుల అంశం గురించి మాట్లాడుతున్న సమయంలో ఇది జరిగింది. ఆ తర్వాత తను కన్నీరు పెట్టాడానికి గల కారణాన్ని వెల్లడించింది.

ఏడ్చేసిన బాలీవుడ్ హీరోయిన్.. ఆ వార్తే కారణం

"నిన్న(ఆదివారం) అంతా బాగానే గడిచింది. కానీ ప్రముఖ ఎన్​బీఏ బాస్కెట్​బాల్ ప్లేయర్ కోబ్ మరణించాడని, వేకువజామున 3 గంటల సమయంలో నా ఫోన్​కు న్యూస్ అలర్ట్ వచ్చింది. హెలికాప్టర్​ ప్రమాదంలో చనిపోయాడనే వార్త నన్ను కలచివేసింది. నిజంగా చాలా బాధ అనిపించింది. వివిధ రోజుల్లో వివిధ సందర్భాలు మన మూడ్ పాడుచేస్తుంటాయి. కానీ మనల్ని మనం నియంత్రించుకోవాలి. రక్తపోటులో కొంచెం హెచ్చుతగ్గులున్నాయి కాబట్టి ఇప్పుడు నన్ను నేను అదుపు చేసుకోలేకపోయాను" -దియా మీర్జా, నటి

బాస్కెట్​బాల్ క్రీడాకారుడు కోబ్ బ్రాయంట్​తో పాటు అతడి కూతురు జియానా హెలికాప్టర్​ ప్రమాదంలో ఆదివారం మరణించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కోబ్​కు సంతాపం ప్రకటించారు.

Last Updated : Feb 28, 2020, 6:37 AM IST

ABOUT THE AUTHOR

...view details