'ధృవ' చిత్రాన్ని కథానాయకుడు రామ్‌చరణ్ కెరీర్‌లో ప్రత్యేకమైన యాక్షన్ థ్రిల్లర్‌గా పేర్కొనవచ్చు. తమిళ మాతృక 'తని ఒరువన్'కు రీమేక్‌గా తీసినా ఈ చిత్రం.. తెలుగులోనూ ప్రేక్షకాదరణ పొందింది. తమిళంలో జయం రవి నటించగా, అతని సోదరుడు మోహన్ రాజ్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు సోదరులిద్దరూ 'తని ఒరువన్-2' కోసం రంగంలోకి దిగనున్నారు. ఫిబ్రవరి షూటింగ్ జరగనుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
'ధృవ 2'లో రామ్‌చరణ్ నటిస్తారా? - ram charan latest news
ధృవ సినిమా మాతృకకు సీక్వెల్‌ను ప్రస్తుతం తీస్తున్నారు. అయితే తెలుగులో దీనిని మళ్లీ రీమేక్ చేస్తారా? ఒకవేళ చేస్తే అందులో రామ్‌చరణ్ నటిస్తారా? అని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
'ధృవ 2'లో రామ్‌చరణ్ నటిస్తారా?
ప్రస్తుతం జయంరవి.. మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్'లో నటిస్తున్నారు. తనకు సంబంధించిన షూటింగ్ మొత్తం జనవరిలోపు పూర్తి చేసుకొని, వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి 'తని ఒరువన్-2' కోసం రంగంలోకి దిగనున్నారు. తెలుగులోనూ మంచి ఆదరణ పొందిన ఈ కథకు సీక్వెల్‌గా 'ధృవ-2' తీస్తారా? తీస్తే అందులో రామ్‌చరణ్ నటిస్తారా? అని టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది.