చూడడానికి తెలుగు అమ్మాయిలా కనిపించి.. ఇక్కడ ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్న బెంగళూరు చిన్నది ధన్యా బాలకృష్ణ. 'లవ్ ఫెయిల్యూర్'తో నటిగా తెలుగు వారికి పరిచయమైన ఈమె పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ మెప్పించింది. 'నేను శైలజా', 'రాజు గారి గది', '‘రాజా రాణి', 'సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు' వంటి చిత్రాలు ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయి. లాక్‌డౌన్ కారణంగా హోమ్ క్వారంటైన్‌లో ఉన్న ధన్య తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఆ విశేషాలు మీకోసం..
మేడమ్.. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?
బెంగళూరు
మీ క్రష్ ఎవరు?
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, సూర్య, రణ్‌బీర్ కపూర్
నటి కాకపోయి ఉండి ఉంటే..?
ప్రపంచంలోనే గొప్ప ప్రేమికురాలిని అయ్యేదాన్ని.
చికెన్ బిర్యానీ లేదా మటన్ బిర్యానీ.. ఏది ఇష్టం?
వెజ్, పెరుగన్నం
మీ రోజువారి దినచర్య?
వంట చేయడం, పుస్తకాలు చదవడం, ఇల్లు శుభ్రం చేయడం, కాఫీ, లూడో ఆడుకోవడం, నిద్రపోవడం, నాన్నతో సరదాగా గొడవ పడడం, అలాగే అమ్మానాన్నల సరదా ఫైట్స్ చూడడం.. ఆ తర్వాత వాళ్లని కౌగిలించుకుని గుడ్‌నైట్ చెప్పడం.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో మహేశ్‌తో కలిసి పనిచేయడం ఎలా ఉంది?
సూపర్బ్! ఆయన ఎంతో మంచి మనస్సున్న, ఓర్పు, సహనం కలిగిన వ్యక్తి. ఆయనతో కలిసి పనిచేయడం నాకు బాగా నచ్చింది.
ఆల్‌టైమ్ ఫేవరెట్ సినిమా ఏది?
టైటానిక్
అజిత్ లేదా విజయ్?
నాకు ఇద్దరూ ఇష్టమే
మీ ముద్దుపేరు ఏమిటి?
పప్పు
మీ జీవితంలో ఏది జరిగినందుకు ఎక్కువగా సంతోషిస్తున్నారు?
నా తల్లిదండ్రులు , స్నేహితులు, నా వర్క్, అంతకంటే ముఖ్యంగా నా పాత్రలన్నింటినీ గుర్తుపెట్టుకుని నన్ను ఎంతో సపోర్ట్ చేస్తున్న మీలాంటి అభిమానులు నా జీవితంలో ఉన్నందుకు ఆనందిస్తున్నా
'రాజారాణి'లో మీ హావభావాలు చాలా బాగుంటాయి?
అవునా!! ధన్యవాదాలు.
సౌందర్య చిట్కాలు ఏమైనా చెప్పగలరు?
శుభ్రంగా తినండి. పాజిటివ్‌గా ఆలోచించండి. మంచిగా మాట్లాడండి.