తమిళ స్టార్ ధనుష్ 'జగమే తందిరం'(jagame thanthiram) సినిమా విడుదలకు కొన్ని గంటల ముందే పైరసీ(movie piracy) సైట్లలో దర్శనమిచ్చింది. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో(netflix) స్ట్రీమింగ్ కావాలి. కానీ అంతకు ముందే పలు వెబ్సైట్లలో కనిపించడం వల్ల నెటిజన్లు అవాక్కయ్యారు.
jagame thanthiram: రిలీజ్‌కు ముందే ధనుష్ సినిమా పైరసీ - మూవీ న్యూస్
ధనుష్ కొత్త సినిమా విడుదల కాకముందే పైరసీ బారిన పడింది. పలు సైట్లలో కనిపించింది. ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ నేపథ్య కథతో తెరకెక్కించారు.
![jagame thanthiram: రిలీజ్‌కు ముందే ధనుష్ సినిమా పైరసీ jagame thanthiram piracy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12177693-601-12177693-1624005528649.jpg)
జగమే తందిరం పైరసీ
ఈ సినిమాలో మోడ్రన్ గ్యాంగ్‌స్టర్‌గా ధనుష్ నటించారు. ఇప్పటికే వచ్చిన పాటలు, టీజర్లు అంచనాలను అమాంతం పెంచేశాయి. మరి చిత్ర ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఇందులో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు.
సరిగ్గా నెల క్రితం విడుదలైన సల్మాన్‌ఖాన్ 'రాధే'(salman Radhe) చిత్రానికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఓటీటీలో విడుదల కావడానికి కొన్నిగంటల ముందు వాట్సాప్, టెలిగ్రామ్(telegram) సైట్లలో దర్శనమిచ్చింది. దీంతో సదరు ఓటీటీ సంస్థ, సైబర్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
Last Updated : Jun 18, 2021, 2:22 PM IST