భారత్‌లోనే వర్సెటైల్ నటుల జాబితాలో ముందుంటారు సూపర్‌స్టార్ ధనుష్. తమిళంలో విపరీతమైన క్రేజ్ ఉన్న ధనుష్‌కు తెలుగు సహా ఇతర భాషల్లోనూ అభిమానులున్నారు. '3', 'రఘువరన్ బీటెక్' వంటి చిత్రాలతో ఇదివరకే తెలుగు ప్రేక్షకులను దగ్గరైన ఆయన.. ఇప్పుడు నేరుగా తెలుగు సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. 'తొలి ప్రేమ' , 'రంగ్‌దే' వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు ధనుష్. గురువారం ఈ సినిమా మోషన్ పోస్టర్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి 'సార్' అనే టైటిల్‌ను ఖరారు చేసింది చిత్రబృందం.
ధనుష్ టాలీవుడ్ ఎంట్రీ.. అదిరిపోయే టైటిల్‌తో.. - సార్
జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ నటిస్తోన్న తొలి తెలుగు సినిమా టైటిల్‌ను ప్రకటించింది చిత్రబృందం. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'సార్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ధనుష్
తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. త్వరలోనే షూటింగ్ పట్టాలెక్కనుంది. తమిళంలో 'వాతి' అనే టైటిల్‌తో రానున్న ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా సంయుక్త మేనన్ నటిస్తోంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. నాగవంశీ-సాయి సౌజన్య నిర్మాతలు.
ఇదీ చూడండి:ఈ ఏడాది ఓటీటీలో సూపర్‌హిట్ చిత్రాలివే!