నాగచైతన్య, సమంత జంటగా నటించి ప్రశంసలు పొందిన చిత్రం 'మజిలీ'. ఈ సినిమా తమిళంలో రీమేక్ కానుంది. కోలీవుడ్ అగ్రనటుడు ధనుష్ హీరోగా నటించనున్నాడని సమాచారం. ప్రస్తుతం అసురన్ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నాడీ కథానాయకుడు.
మజిలీ రీమేక్‌లో తమిళ స్టార్ హీరో..? - నాగచైతన్య
తెలుగులో ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సినిమా 'మజిలీ'. ఈ చిత్రం తమిళంలో రీమేక్ కానుంది. ధనుష్ హీరోగా నటించనున్నాడని సమాచారం.
మజిలీ రీమేక్‌లో తమిళ స్టార్ హీరో ధనుష్
శివ నిర్వాణ దర్శకత్వం వహించిన మజిలీ.. కుటుంబ ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందుతోంది. వైజాగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరో భగ్న ప్రేమికుడిగా నటించాడు. సాధారణంగా భావోద్వేగ చిత్రాలంటే ఇష్టపడే తమిళ ప్రేక్షకులు.. ఈ రీమేక్‌ను ఎలా ఆదరిస్తారో చూడాలి.
ఇది చదవండి: 'నాగచైతన్యలో నన్ను నేను చూసుకున్నా'