తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలీవుడ్​లో ధనుష్ మరో రెండు సినిమాలు - ధనుష్ ఐశ్వర్య డైవోర్స్

'అత్రంగీ రే' విజయంతో ధనుష్​కు బాలీవుడ్​లో క్రేజ్ పెరిగింది. దీంతో అతడితో సినిమాలు చేసేందుకు హిందీ దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.

dhanush movies
ధనుష్

By

Published : Jan 26, 2022, 7:26 AM IST

తమిళ హీరో ధనుష్‌.. దక్షిణాదిలోనే కాదు హిందీ ప్రేక్షకులనూ అలరిస్తున్నారు. ఈ మధ్య విడుదలైన హిందీ చిత్రం 'అత్రంగీ రే' సినిమాతో ధనుష్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఆనంద్‌ ఎల్‌రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సారా అలీఖాన్‌, అక్షయ్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటించారు. ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అలరించింది. ఇప్పుడు ధనుష్‌తో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారట ఆనంద్‌.

"ఆనంద్‌ ఎల్‌ రాయ్‌, ధనుష్‌లది మంచి కాంబినేషన్‌. మళ్లీ ఈ కలయికలో సినిమా రానుంది. ప్రేమకథా చిత్రమిది. ఈ చిత్రాన్ని ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ నిర్మాణ సంస్థ కలర్‌ ఎల్లో నిర్మించనుంది" అని రాయ్‌ సన్నిహిత వర్గాలు చెప్పినట్టు సమాచారం.

హీరో ధనుష్

దీంతో పాటు బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ ధనుష్‌తో సినిమా చేయనుందని తెలుస్తోంది. 'అత్రంగీ రే' విజయం తర్వాత ధనుష్‌తో సినిమాలు చేయడానికి బాలీవుడ్‌ దర్శకనిర్మాతలు బాగా ఉత్సాహంగా ఉన్నట్లు బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details