తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Dhanush: ధనుష్ తొలి​ తెలుగు సినిమా.. అదీ పాన్ ఇండియా కథతో - ధనుష్

అస్సలు ఈ కాంబినేషన్​ జనాలు కూడా ఎక్స్​పెక్ట్ చేసి ఉండరు. అదే ధనుష్- శేఖర్ కమ్ముల. వీరి ఇద్దరు కలిసి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరి అది ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

dhanush
ధనుష్ కొత్త చిత్రం

By

Published : Jun 18, 2021, 9:59 AM IST

తమిళ ప్రముఖ నటుడు ధనుష్.. నేరుగా తెలుగులో నటించేందుకు సిద్ధమయ్యారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయనున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. 'లవ్​స్టోరి' చిత్రాన్ని నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థ.. ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది. తెలుగు, తమిళం, హిందీలో ఈ సినిమా విడుదల కానుంది. ధనుష్​కు క్రేజ్ దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి.

ధనుష్ కొత్త చిత్రం..

ధనుష నటించిన 'జగమే తంత్రం'.. శుక్రవారం (జూన్ 18) ఓటీటీలో విడుదలైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం తెరకెక్కిన 'లవ్​ స్టోరి' కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. జులై లేదంటే ఆగస్టులో థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.

ఇదీ చదవండి :హద్దులు చెరిపేస్తూ.. దేశమంతా విస్తరిస్తూ..

ABOUT THE AUTHOR

...view details