తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ధనుష్ సెంటిమెంట్ రీపీట్ అవుతుందా..!​ - తూటా

తమిళ నటుడు ధనుష్ హీరోగా వచ్చిన 'రఘువరన్ బీటెక్' ఘనవిజయం సాధించింది. ఈ సినిమా 2015లో జనవరి 1న విడుదలై మంచి ఫలితాన్ని అందుకుంది. ఇప్పుడు ఇదే సెంటిమెంట్​ను రిపీట్ చేయబోతున్నాడు ధనుష్.

Dhanush
ధనుష్

By

Published : Dec 24, 2019, 8:40 AM IST

తమిళ చిత్రం 'వెల్లైలా పట్టాదారి'కి అనువాదమే 'రఘువరన్ బీటెక్'​. కామెడీ.. ప్రేమ.. సెంటిమెంట్​.. వీటితో పాటు ఓ సామాన్య మధ్య తరగతి యువకుడు లక్ష్య సాధనలో ఎదురయ్యే ఇబ్బందులు ఎలా ఎదుర్కొన్నాడనే కథాంశంతో సినిమా తెరకెక్కింది. తమిళ చిత్రం 2014 జులై 18న విడుదలకాగా.. రఘువరన్ బీటెక్​ 2015 జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ తేదీలతో సంబంధం ఏమిటా అని ఆలోచిస్తున్నారా..! ఇక్కడే ఓ ట్విస్ట్​ ఉంది.

మళ్లీ అదే తేదీలో..

ఇప్పుడు మళ్లీ అదే తేదీలో మరోసారి తెలుగు అభిమానుల ముందుకు రాబోతున్నాడు ధనుష్​. గౌతమ్ మీనన్​ దర్శకత్వంలో ఈ హీరో 'ఎన్నై నొక్క పాయమ్​ తోటా' చేశాడు. ఈ సినిమాను తెలుగులో 'తూటా' పేరుతో 2020 జనవరి 1న విడుదల చేయనున్నారు.

ఇన్నేళ్ల తర్వాత..

ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే తేదీలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడంటే విశేషమే కదా! మరి ఈ చిత్రం ధనుష్​ అభిమానులను ఎంత వరకు మెప్పించగలదో తెలుసుకోవాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇవీచూడండి.. కట్టప్పలా ఈ పాత్ర గుర్తుండిపోతుంది: సత్యరాజ్​

ABOUT THE AUTHOR

...view details