Dhanush SIR movieస్టార్ హీరో ధనుష్.. తొలి తెలుగు సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లో సోమవారం పూజా కార్యక్రమం జరిగింది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్.. ముఖ్య అతిథిగా హాజరై, క్లాప్ కొట్టారు. జనవరి 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
'సార్' టైటిల్‌తో తీస్తున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. 'భీమ్లా నాయక్'లో రానాకు జోడీగా నటిస్తున్న సంయుక్త మేనన్.. ఈ సినిమా కోసం హీరోయిన్గా ఎంపిక చేశారు. జీవీ ప్రకాశ్ సంగీతమందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.