తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు: ధనుష్​​ - dhanush hollywood film

Dhanush The Gray Man Movie: హాలీవుడ్​ సినిమా 'ది గ్రే మ్యాన్​'లో తనకు అవకాశం రావడం గొప్పగా భావిస్తున్నట్లు అన్నారు కోలీవుడ్​ స్టార్​ హీరో ధనుష్​​. ఈ చిత్రంతో నటుడిగా ఎన్నో కొత్త పాఠాలను నేర్చుకున్నట్లు తెలిపారు.

ధనుశ్​ హాలీవుడ్​ సినిమా ది గ్రే మ్యాన్​, Dhanush the grey man
ధనుశ్​ హాలీవుడ్​ సినిమా ది గ్రే మ్యాన్​

By

Published : Dec 12, 2021, 7:36 AM IST

Dhanush The Gray Man Movie: తమిళ కథానాయకుడు ధనుష్​​ హాలీవుడ్‌లో 'ది గ్రే మ్యాన్‌' చిత్రం చేస్తున్నారు. ప్రముఖ దర్శకులు రస్సో బ్రదర్స్‌ తెరకెక్కిస్తున్నారు. రియాన్‌ గోస్లింగ్‌, క్రిస్‌ ఎవాన్స్‌, అనా డి అర్మాస్‌, జెస్సికా హెన్విక్‌ తదితర హాలీవుడ్‌ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది.

తాజాగా ఈ చిత్ర అనుభవాలను తెలిపారు ధనుష్​. "ఇంత గొప్ప సినిమాలో భాగమవుతానని నేనెప్పుడూ ఊహించలేదు. నాకిదొక ఆసక్తికర అవకాశం. ఈ చిత్రంతో నటుడిగా నేనెన్నో కొత్త పాఠాలు నేర్చుకునే అవకాశమొచ్చింది. అందుకే ఈ ప్రయాణం నాకు చాలా నచ్చింది. త్వరలో తిరిగి చిత్రీకరణలో పాల్గొంటా" అని అన్నారు​.

తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. "నేనెప్పుడూ అవకాశాల వెంటపడలేదు. నా వద్దకు వచ్చినవి వచ్చినట్లు నిజాయితీగా చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ ప్రయాణం ఎక్కడికి దాకా వెళ్తుందన్నది దేవుడిపై ఆధారపడి ఉంది. ఆయన ఏ వైపు నడిపిస్తే ఆ వైపు వెళ్తాన"ని చెప్పుకొచ్చారు. మార్క్‌ గ్రీనీ రాసిన ఓ నవల ఆధారంగా విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌గా 'ది గ్రే మ్యాన్‌'ను ముస్తాబు చేస్తున్నారు. ఇది త్వరలో ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

ఇదీ చూడండి: స్టార్ హీరో డ్రీమ్ హౌస్​ కోసం రూ.150 కోట్లు!

ABOUT THE AUTHOR

...view details