తమిళ నటుడు ధనుష్ చూడటానికి బక్కపల్చగా ఉన్నా ఫిట్‌గా ఉంటూ తనదైన నటనతో దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన నటించిన 'మారి' సీక్వెల్ (ఫ్రాంచైజీ) 'మారి 2' చిత్రం ఘన విజయాన్ని సాధించింది. అయితే తాజాగా ఈ సినిమా కోసం ధనుష్ చేసిన వర్కౌట్స్ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.
ఈ చిత్రంలో ధనుష్ పతాక సన్నివేశాల్లో ఒంటిపై చొక్కా లేకుండా ఓ ఫైట్ ఉంటుంది. ఆ సన్నివేశం కోసం ధనుష్ చేసిన కసరత్తుల వీడియోనే హల్చల్ చేస్తోంది. సాయి పల్లవి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహించారు.