తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వరుస చిత్రాలతో ధనుష్ ఫుల్​ 'పటాస్' - స్నేహ

తమిళ హీరో ధనుష్ కొత్త చిత్రం 'పటాస్' ఫస్ట్​లుక్ ఆకట్టుకుంటోంది. ఇందులో తండ్రి, కొడుకు పాత్రల్లో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు ఈ తమిళ హీరో.

పటాస్​ తమిళ సినిమా ఫస్ట్​లుక్

By

Published : Jul 29, 2019, 9:56 AM IST

విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న తమిళ హీరో ధనుష్​. కేవలం కోలీవుడ్​లోనే కాకుండా బాలీవుడ్​, హాలీవుడ్​లో​ నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవలే 'ది ఎక్స్​ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఫకీర్​'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్వరలో 'పటాస్​'గా రానున్నాడు. ఈ సినిమా ఫస్ట్​లుక్​ను ఆదివారం విడుదల చేశారు. డిఫరెంట్​గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడీ కథానాయకుడు.

పటాస్​ తమిళ సినిమా ఫస్ట్​లుక్

ఇందులో తండ్రి, కొడుకు పాత్రల్లో కనిపించనున్నాడు ధనుష్. స్నేహ, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్.ఎస్.దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.

వెట్రిమారన్​ దర్శకత్వంలో 'అసురన్​' సినిమాను ఇటీవలే పూర్తి చేశాడు ధనుష్. 'ఎనై నొక్కి పాయమ్ తొట్టా' విడుదలకు సిద్ధమవుతోంది. ఇవే కాకుండా మరో రెండు చిత్రాల్లో నటించేందుకు సిద్ధమయ్యాడు ఈ తమిళ హీరో.

ఇది చదవండి: 'భాష ఏదైనా.. పాత్రకు న్యాయం చేయడమే ముఖ్యమని అంటున్న హీరో ధనుష్

ABOUT THE AUTHOR

...view details