'ఉప్పెన' చిత్రంలోని 'నీ కన్ను నీలి సముద్రం', 'ధక్ ధక్ ధక్', 'రంగులద్దుకున్న' పాటలు శ్రోతల్ని బాగా అలరించాయి. ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరో ప్రేమ గీతం సంగీతం ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 'జల జల జలపాతం నువ్వు' అనే మెలొడీని విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాట కూడా అభిమానుల్ని ఆకట్టుకునేలా ఉంది. పంజా వైష్ణవ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా తెరకెక్కించారు. ఈ ప్రేమకథ ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకొస్తుంది.
ధనుష్ కథానాయకుడుగా రూపొందుతున్న చిత్రం 'కర్ణన్'. సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేస్తామని తెలిపింది. ఈ టీజర్లో ధనుష్ కత్తి పట్టుకుని మాస్ లుక్‌లో కనిపించాడు.