తమిళ హీరో ధనుష్ నటిస్తున్న 'కర్ణన్' సినిమా టీజర్ విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 9న థియేటర్లలోకి రానుంది.
అగ్ర కథానాయిక తమన్నా కీలక పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ '11th అవర్'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 9వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. "లాక్‌డౌన్‌లో తాను విన్న తొలి కథ '11th అవర్' అని అన్నారు. విన్న వెంటనే తనకు కథ బాగా నచ్చిందని, అన్ని రకాలుగా మహిళలను బలపేతం చేసేలా ఇందులోని తన పాత్ర ఉంటుందన్నారు. తెలుగు సినిమాల్లో ఇలాంటి కంటెంట్‌తో ఇప్పటివరకూ సినిమా రాలేదని అన్నారు.
మెగా హీరో సాయిధర్మ్ తేజ్ నటించిన 'రిపబ్లిక్' ఫస్ట్‌లుక్‌ను మార్చి 25న ఉదయం 11గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. జూన్ 4న విడుదల కానుందీ చిత్రం. 'ప్రస్థానం' ఫేమ్ దేవకట్టా దర్శకుడు.