తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మరోసారి హాలీవుడ్​లో ఛాన్స్​ కొట్టేసిన ధనుష్​ - ది గ్రే మ్యాన్​ చిత్రంలో ధనుష్​కు ఆఫర్​

మరోసారి హాలీవుడ్​ చిత్రంలో కోలీవుడ్​ హీరో ధనుష్​కు అవకాశం లభించింది. ర్యాన్​ గాస్లింగ్​, క్రిస్​ ఇవాన్స్​ ప్రధానపాత్రల్లో నటిస్తోన్న 'ది గ్రే మ్యాన్​' అనే చిత్రంలో ఓ పాత్ర కోసం ధనుష్​ను ఎంపిక చేసింది చిత్రబృందం.

Dhanush joins cast of Russo brother's 'The Gray Man'
మరోసారి హాలీవుడ్​లో ఛాన్స్​ కొట్టేసిన ధనుష్​

By

Published : Dec 18, 2020, 10:36 AM IST

కోలీవుడ్​ కథానాయకుడు ధనుష్​కు మరోసారి హాలీవుడ్​ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ర్యాన్ గాస్లింగ్​, క్రిస్​ ఇవాన్స్​ ప్రధానపాత్రల్లో నటిస్తున్న 'ది గ్రే మ్యాన్​' అనే సినిమాలో పాత్ర కోసం ధనుష్​ను ఎంపికచేసింది చిత్రబృందం.

నెట్​ఫ్లిక్స్​ కోసం రూపొందుతోన్న ఈ చిత్రానికి 'అవెంజర్స్:ఎండ్​గేమ్' ఫేమ్ ఆంటోనీ రూసో, జో రూసో సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. మార్క్​ గ్రీనీ రచించిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

'నార్కోస్​' నటుడు వాగ్నెర్​ మౌరా, 'వన్స్​ అపాన్​ ఏ టైమ్ ఇన్​ హాలీవుడ్​'లోని బాలనటుడు జూలియా బటర్స్​, 'గేమ్​ ఆఫ్​ థ్రోన్స్​' నటి అలుమ్​ జెస్సికా హెన్విక్​లతో పాటు ధనుష్​ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నట్లు వెల్లడించారు.

కెన్​ స్కాట్​ దర్శకత్వంలో రూపొందిన 'ది ఎక్స్​ట్రార్డినరీ జర్నీ ఆఫ్​ ది ఫకీర్​' అనే చిత్రం ద్వారా ధనుష్​ హాలీవుడ్​లో అరంగేట్రం చేశాడు. 2018లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. ధనుష్​.. ప్రస్తుతం 'అంత్రాగిరే' చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ధనుష్​తో పాటు అక్షయ్​ కుమార్​, సారా అలీఖాన్​ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details