తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఓటీటీలో ధనుష్‌ చిత్రం- టీజర్‌ రిలీజ్ - జగమే తంత్రం టీజర్​

తమిళ హీరో ధనుష్​​ నటించిన 'జగమే తంత్రం' సినిమా ఓటీటీ నెట్​ఫ్లిక్స్​లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా టీజర్​ను విడుదల చేసింది.

dhanush
ధనుశ్​

By

Published : Feb 22, 2021, 2:13 PM IST

ధనుష్​‌ కథానాయకుడిగా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'జగమే తందిరమ్‌'. తెలుగులో 'జగమే తంత్రం' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఐశ్వర్య లక్ష్మీ కథానాయిక. గతేడాది చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పటివరకు విడుదల కాలేదు.

తాజాగా ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో ధనుష్‌ సూరాలి అనే గ్యాంగ్‌స్టర్‌గా కనిపించారు. పక్కా మాస్‌ కమర్షియల్‌ సినిమాగా 'జగమే తంత్రం'ను తీర్చిదిద్దినట్లు టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది.

రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను శశికాంత్‌, చక్రవర్తి, రామచంద్ర నిర్మించారు. సంతోష్‌ నారాయణ స్వరాలు సమకూర్చారు.

ఇదీ చూడండి: 'సీటీమార్'​ టీజర్​.. మహేశ్​ సినిమా షెడ్యూల్​ పూర్తి

ABOUT THE AUTHOR

...view details