తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తోన్న చిత్రం 'జగమే తందిరం' (Jagame Thandiram). ఐశ్వర్య లక్ష్మీ నాయిక. ఓటీటీ వేదికగా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధవుతోంది. జూన్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ (Jagame Thandiram trailer) విడుదల చేసింది చిత్రబృందం.
Dhanush: ఆకట్టుకుంటోన్న 'జగమే తందిరం' ట్రైలర్ - నెట్‌ఫ్లిక్స్‌లో జగమే తందిరం
ధనుష్ (Dhanush) హీరోగా కార్తీక్ సుబ్బరాజు తెరెకెక్కించిన చిత్రం 'జగమే తందిరం' (Jagame Thandiram). జూన్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం.
![Dhanush: ఆకట్టుకుంటోన్న 'జగమే తందిరం' ట్రైలర్ jagame thandiram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11974429-559-11974429-1622528969026.jpg)
జగమే తందిరం
గ్యాంగ్‌స్టర్ పాత్రలో ధనుష్ నటన విశేషంగా ఆకట్టుకుంటోంది. మాస్ లుక్‌లో దర్శనమిచ్చి అదరగొట్టాడు. యాక్షన్ సన్నివేశాలు, నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచాయి. తమిళనాడు నుంచి లండన్ వెళ్లిన ఓ గ్యాంగ్‌స్టర్ కథతో ఈ సినిమా రూపొందింది.
ఈ చిత్రాన్ని వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడు. తెలుగులో 'జగమే తంత్రం' పేరుతో రానుంది. ఇప్పటికే విడుదలైన కొన్ని పాటలు శ్రోతల్ని అలరించాయి.