తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Dhanush News: హీరో ధనుష్‌, ఐశ్వర్య దంపతుల విడాకులు - Dhanush news

Dhanush News: తమిళ నటుడు ధనుష్‌, ఐశ్వర్య దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

Dhanush announces separation with wife Aishwaryaa
ధనుష్‌, ఐశ్వర్య దంపతులు

By

Published : Jan 18, 2022, 12:20 AM IST

Updated : Jan 18, 2022, 4:41 AM IST

Dhanush News: తమిళ హీరో ధనుష్‌, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్య దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించారు. తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు వారు ఉమ్మడి లేఖను విడివిడిగా సామాజిక మాధ్యమాల్లోప్రకటించారు.

"18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు మేము వేరువేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. ఐశ్వర్య, నేను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. వ్యక్తిగతంగా సమయం వెచ్చించాలనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని దయచేసి గౌరవించండి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యక్తిగత గోప్యత అవసరం" అని ధనుష్‌ ట్విటర్‌లో ఉంచిన లేఖలో పేర్కొన్నాడు.

మరోవైపు ఐశ్వర్య సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో అదే లేఖను పోస్టు చేశారు. ఈ లేఖకు ఎలాంటి క్యాప్షన్‌ అవసరం లేదని, ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడం, ప్రేమ మాత్రమే కావాలని ఐశ్వర్య పేర్కొంది.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ఐశ్వర్య పెద్దకూతురు. ధనుష్‌తో ఐశ్వర్యకు 2004 నవంబర్‌ 18న వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నారు ధనుష్​. అందులో 'సార్', డైరెక్టర్ శేఖర్ కమ్ములతో చిత్రాలు ఉన్నాయి. హాలీవుడ్​లోనూ 'గ్రే మ్యాన్' సినిమాలో నటిస్తున్నారు.

ఇదీ చూడండి:ఆరు నిమిషాల్లో ఆ పాట రాసిన హీరో ధనుష్.. ఇంతకీ ఎలా సాధ్యం?

Last Updated : Jan 18, 2022, 4:41 AM IST

ABOUT THE AUTHOR

...view details