తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రౌడీ బేబీ' రికార్డు.. ఈసారి వరల్డ్ వైడ్​గా - rowdy baby world record

'మారి 2' చిత్రంలోని 'రౌడీ బేబీ' పాట మరో రికార్డును కైవసం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వీక్షణలు పొందిన జాబితాలో టాప్-​10లో చోటు దక్కించుకుంది.

dhanush
రౌడీ

By

Published : Dec 7, 2019, 9:43 AM IST

ధనుష్​, సాయి పల్లవి ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'మారి 2'. ఈ సినిమాలో 'రౌడీ బేబీ' పాట యూట్యూబ్ వీక్షణల్లో రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా మరో ఘనతను తన ఖతాలో వేసుకుంది.

దేశంలోనే కాదు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 2019లో ఎక్కువ వీక్షణలు సంపాదించిన జాబితాలో ఏడోస్థానంలో నిలిచింది. 700 మిలియన్స్​కు పైగా వ్యూస్​తో దూసుకుపోతుంది. ఈ విషయాన్ని 'బిల్​బోర్డ్' స్పష్టం చేసింది. అలాగే ఈ ఏడాది ఇండియాలో ఎక్కువ వ్యూస్ సాధించిన వీడియోగానూ ఘనత సాధించింది.

బిల్​బోర్డ్ ట్వీట్

యువన్ శంకర్​రాజ్ ఆకట్టుకునే సంగీతం.. ధనుష్, సాయిపల్లవిల ఎనర్జిటిక్ డ్యాన్స్, ప్రభుదేవా కొరియోగ్రఫీ అన్నీ కలిసి ఈ పాటను మాస్ హిట్​ చేశాయి.

ఇవీ చూడండి.. ఆరోజు వస్తుందని అనుకోలేదు: అక్షయ్

ABOUT THE AUTHOR

...view details