ధనుష్, మేఘా ఆకాష్ జంటగా నటించిన చిత్రం 'తూటా'. తమిళంలో తెరకెక్కిన 'ఎనాయి నోకి పాయుం తోట' సినిమాకు తెలుగు డబ్బింగ్ ఇది. గౌతమ్ మేనన్ దర్శకత్వం వహించాడు. తాజాగా సినిమా ట్రైలర్ విడుదలైంది.
ట్రైలర్: ధనుష్ ప్రేమ 'తూటా' పేలుస్తున్నాడు..! - తూటా సినిమా ట్రైలర్
ధనుష్, మేఘా ఆకాష్ కలిసి నటించిన ఓ ప్రేమ కథ 'తూటా'. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమాాాా ట్రైలర్ విడుదలైంది.
'తూటా' కథ మొదలు 'లేఖ' తోనే...
" నా కథకు మొదలు లేఖ..." అంటూ సాగే ట్రైలర్లో.. తన లవ్ స్టోరీతో కథ మొదలు పెట్టాడు ధనుష్. ఇందులో మేఘతో కలిసి ఘాటైన రొమాన్స్ చేశాడీ స్టార్ హీరో.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని 'ఎటు మనం పోగలం' అనే పాటకు మంచి స్పందన వచ్చింది. దర్బుక శివ స్వరపరిచిన ఈ పాటకు... చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించాడు. సిద్ శ్రీరామ్ ఆలపించాడు. విజయభేరి పతాకంపై జీ తాత రెడ్డి, సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.