బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్... కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇటీవలే 'జడ్జిమెంటల్ హై క్యా' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది. అంతకుముందు 'మణికర్ణిక'గా కత్తి పట్టిన ఈ భామ.. ఇప్పుడు 'ధాకద్'లో పూర్తి స్థాయి యాక్షన్ పాత్రలో కనిపించనుంది. శుక్రవారం విడుదలైన టీజర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఇందులో ఎమ్ 4 కార్బైన్ గన్‌తో శత్రువుల గుండెల్లో బుల్లెట్ల వర్షం కురిపించి, ముఖంపై చిందిన రక్తాన్ని నాలుకతో రుచి చూస్తున్న కంగన.. అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది. సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది.