టాలీవుడ్‌లో సంగీతం సంచలనం అని పేరుంది దేవీశ్రీ ప్రసాద్‌కి. మెలోడీలతో హృదయాన్ని హత్తుకుంటూనే మాస్ బీట్స్‌తో స్టెప్పులు వేయిస్తాడు. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు వరుస అవకాశాలు అందుకుంటూ సంగీత ప్రియుల్ని అలరిస్తున్నాడు. కోలీవుడ్‌లోనూ దేవీ గీతాలకు మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు తన మ్యూజిక్ మ్యాజిక్‌ను బాలీవుడ్ ప్రేక్షకులకు అందించనున్నాడని సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
దేవీ స్వరాలు హిందీ ప్రేక్షకులకు కొత్తేమీ కాదు కానీ, పూర్తి స్థాయిలో ఒక చిత్రానికి పనిచేయడం ఇదే తొలిసారని చెప్పొచ్చు. గతంలో 'రెడీ', 'జయహో', 'భాగ్ జానీ' చిత్రాల్లో ప్రత్యేక గీతాలు రూపొందించాడు. ప్రస్తుతం 'జయేయ్ భాయ్ జర్దార్' అనే సినిమాకు స్వరకర్తగా దేవీని ఎంపిక చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని తెలుస్తోంది.