నేడు(సెప్టెంబరు 2) పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పుట్టినరోజు(Pawankalyan Birthday). ఈ సందర్భంగా పలువురు నటులు, అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సంగీత దర్శకులు దేవీశ్రీ ప్రసాద్, బాబా సెహగల్ కూడా పవన్‌కు ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ తెలిపారు. పవన్ కోసం తాము పాడిన పాటలను విడుదల చేశారు.
గతంలో పవన్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో 'జల్సా'(pawan kalyan jalsa cinema) సినిమాలో నటించారు. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతమందించారు. ఇందులో 'జల్సా' అంటూ సాగే పాటను దేవీ ఆలపించారు. ఆ సమయంలో చిత్రీకరించిన ఈ గీతానికి సంబంధించిన ప్రమోషనల్ మ్యూజిక్ వీడియోను కొన్ని కారణాల వల్ల రిలీజ్ చేయలేకపోయినట్లు తెలిపిన ఆయన.. ఇప్పుడు దాన్ని ప్రత్యేకంగా పవర్‌స్టార్ ఫ్యాన్స్ కోసం విడుదల చేశారు. ఈ సాంగ్‌ను పవన్‌కు అంకితమిస్తున్నట్లు తెలిపారు.