తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'దేవినేని' మొదటి షెడ్యూల్ పూర్తి - devineni

దేవినేని నెహ్రూ పాత్రలో నందమూరి తారకరత్న నటిస్తోన్న చిత్రం 'దేవినేని'. ఈ సినిమా చిత్రీకరణ మొదటి షెడ్యూల్ పూర్తయింది.

తారకరత్న

By

Published : May 29, 2019, 5:00 AM IST

నందమూరి తారకరత్న ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'దేవినేని'. ఈ సినిమాలో దేవినేని నెహ్రూగా తారకరత్న నటిస్తున్నాడు. 'బెజవాడ సింహం' అనేది ట్యాగ్​లైన్. నర్రా శివ నాగేశ్వరరావు(శివ నాగు) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

బెజవాడలో ఇద్దరు మహానాయకుల మధ్య స్నేహం, వైరంతో పాటు కుటుంబ నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. బెజవాడలోని మరో సీనియర్ ప్రజా నాయకుడు వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ నటిస్తుండగా, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ నటిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ఇవీ చూడండి.. రూ.175కోట్లు దాటిన మహేశ్ 'మహర్షి'

ABOUT THE AUTHOR

...view details