తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మోహన్​లాల్​కు ఛాలెంజ్​ విసిరిన డీఎస్పీ - మోహన్​లాల్​కు దేవిశ్రీ బి ద రియల్​ మెన్​ ఛాలెంజ్​

'బి ద రియల్‌ మ్యాన్‌' ఛాలెంజ్‌లో భాగమైన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌.. సోషల్ మీడియాలో వీడియోను పంచుకున్నాడు. మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్‌కు ఛాలెంజ్​ విసిరాడు.

Devi sri prasad nominated the Be the real man challenge to  the Mohanlal
మోహన్​లాల్​కు దేవిశ్రీ ఛాలెంజ్​

By

Published : Apr 29, 2020, 6:12 PM IST

మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్‌కు, ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ఛాలెంజ్‌ విసిరాడు. ఇంటి పనుల్లో శ్రీమతికి సాయం చేసి, ఆ వీడియోను పోస్ట్‌ చేయమని ఆయన్ని కోరాడు. లాక్‌డౌన్‌తో షూటింగ్స్‌ నిలిచిపోవడం వల్ల ఇంటికే పరిమితమైన సినీ సెలబ్రిటీలు.. ప్రస్తుతం 'బి ద రియల్‌ మ్యాన్‌' ఛాలెంజ్‌లో భాగమవుతున్నారు. ఇందులో భాగంగా ఇంట్లోని మహిళలకు అన్ని పనుల్లో సాయం చేసి రియల్‌ మ్యాన్‌ అనిపించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్‌ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన డీఎస్పీ.. ఇంటి పనుల్లో తన తల్లికి సాయం చేసి, వంట చేసి పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేశాడు. "సుక్కు భాయ్‌ నా ఛాలెంజ్‌ వీడియో ఇదిగో. సందీప్‌రెడ్డి వంగా, రాజమౌళి, చిరంజీవి వీడియోలను చూశాక నేనూ ఇందులో భాగమయ్యాను. అల్లు అర్జున్‌, కార్తి, యశ్‌, హరీశ్‌ శంకర్‌, మోహన్‌లాల్‌ సర్​కు ఈ ఛాలెంజ్‌ కోసం నామినేట్‌ చేస్తున్నా" అని రాసుకొచ్చాడు.

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు. 'ఉప్పెన'కు ఇతడే సంగీతమందించాడు. అయితే ఈ చిత్రం ఏప్రిల్​లో రావాల్సి ఉన్నా, కరోనా వల్ల వాయిదా పడింది. అలానే అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'పుష్ప'కు డీఎస్పీనే స్వరాలు అందిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details