నటన, అందం, అభినయంతో దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది హీరోయిన్ శ్రుతిహాసన్. దశాబ్దానికి పైగా సినీ రంగంలో ఉన్న ఈ భామ.. ఇప్పటివరకు వెండితెరపై మాత్రమే కనిపించింది. ఇకపై చిన్నతెరపైనా సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలే 'దేవి' అనే లఘుచిత్రంలో నటించింది. అందుకు సంబంధించిన పలు విషయాలు చెప్పింది.
" ఓ మహిళ శక్తి ఏంటో తెలియాలంటే 'దేవి' షార్ట్ ఫిల్మ్ చూస్తే అర్ధమవుతుంది. స్త్రీలు ఒకరికొకరు ఏవిధంగా సహాయం చేసుకుంటారో చెప్పేదే ఈ లఘచిత్రం. తొమ్మిది మంది మహిళలకు వారి జీవితంలో ఒకే విధమైన సమస్య ఎదురైతే వాటిని వారు ఒక్కటిగా ఎలా అధిగమించారో ఇందులో చూడొచ్చు. ఇందులో ప్రముఖ నటీమణులతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది."