తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పెళ్లిపై స్పందించిన విజయ్​దేవరకొండ.. ఏమన్నారంటే? - పుష్పకవిమానం చిత్రం

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ.. తన సోదరుడు ఆనంద్​తో కలిసి ఓ స్పెషల్​ చిట్​చాట్​లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా అన్నదమ్ములిద్దరూ తమ పెళ్లి గురించి మాట్లాడారు. ఇంకా తమకు సంబంధించిన పలు ఆసక్తికర సంగతులను తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను చూసేయండి..

vijay devarakonda
విజయ్ దేవరకొండ

By

Published : Oct 24, 2021, 3:29 PM IST

తనకంటే ముందు తన సోదరుడు ఆనంద్‌కే వివాహం జరుగుతుందని టాలీవుడ్‌ సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ అన్నారు. ఆనంద్‌ ప్రధాన పాత్రలో నటించిన 'పుష్పకవిమానం' మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్‌ అమాయకుడైన యువకుడి పాత్రలో నటించారు. దామోదర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయ్‌ దేవరకొండ నిర్మాతగా వ్యవహరించారు.

కాగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దేవరకొండ బ్రదర్స్‌ ఓ స్పెషల్‌ చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. తమ జీవితాల్లో జరిగిన ఆసక్తికర సంఘటనలను అన్నదమ్ములిద్దరూ సరదాగా పంచుకున్నారు. దానికి సంబంధించిన ప్రోమోను విజయ్​ షేర్‌ చేశారు.

దేవరకొండ బ్రదర్స్

"స్కూల్‌లో చదువుకునే రోజుల్లో వేసవి కాలం సెలవులకు ఇంటికి వచ్చేవాళ్లం. రెండు నెలలు ఇంట్లోనే సరదాగా ఉండేవాళ్లం. ఆనంద్‌ మాత్రం నాకు చుక్కలు చూపించేవాడు. నన్ను బాగా విసిగించేవాడు" అని విజయ్‌ చెప్పగానే.. ఆనంద్‌ నవ్వులు పూయించారు.

అనంతరం విజయ్‌.. "నాకంటే ముందు ఆనంద్‌కే పెళ్లి అవుతుంది" అనగానే.. "నో అన్నయ్యకే ముందు" అని ఆనంద్‌ సైగలు చేశారు. "అమ్మ ఫెవరెట్ ఎవరు" అనేదానికి సమాధానం చెబుతూ.. తానే అన్నట్లు ఇద్దరూ సమాధానం ఇచ్చుకున్నారు. ఇలా, ఎంతో సరదాగా సాగిన దేవరకొండ సోదరుల ఫన్నీ ఇంటర్వ్యూ పూర్తిగా చూడాలంటే రేపటి వరకూ వేచి చూడాల్సిందే. రేపు ఈ వీడియో విడుదల చేయనున్నారు.

ఇదీ చదవండి:

Chiranjeevi news: అభిమానికి మెగాస్టార్ చిరంజీవి భరోసా

ABOUT THE AUTHOR

...view details