తన ఇంట్లో పనిచేసే ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు వెల్లడించింది ముంబయికి చెందిన ప్రముఖ జ్యువెలరీ డిజైనర్ ఫరా ఖాన్ అలీ. ఈ విషయాన్ని చెబుతూ ట్వీట్ చేసింది. బాలీవుడ్ హీరో హృతిక్‌రోషన్ మాజీ భార్య సుజానే ఖాన్ సోదరి ఫరాఖాన్.
"కరోనా కంటే అది సోకిందన్న వార్తే త్వరగా వ్యాప్తిస్తోంది. నా ఇంట్లో పనిచేసే ఓ వ్యక్తికి ఈ వైరస్ పాజిటివ్‌గా తేలింది. వెంటనే ఆస్పత్రికి తరలించాం. నాతో సహా మా ఇంట్లోని వారందరూ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రస్తుతం మేం క్వారంటైన్లోకి వెళ్తున్నాం"