తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ పాత్రల్లో నటించి మెప్పించాలనుంది: పాయల్​ - డీ గ్లామర్​ రోల్స్​

తనలోని నటన సామర్థ్యాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలంటే డీగ్లామర్​ పాత్రలు బాగా ఉపయోగపడతాయని చెప్పింది హీరోయిన్​ పాయల్ రాజ్​పుత్​. ప్రస్తుతం 5డబ్ల్యూస్‌ చిత్రంలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

payal rajput
పాయల్​

By

Published : Dec 3, 2020, 6:44 AM IST

Updated : Dec 3, 2020, 11:48 AM IST

"ఎప్పుడూ అందాల ఆరబోతే అంటే బోర్‌ కొడుతుంది. డీగ్లామర్‌ పాత్రల్లోనూ మెప్పించాలని ప్రతి ఒక్క హీరోయిన్‌కూ ఉంటుంది" అంటోంది పాయల్‌ రాజ్‌పూత్‌. 'ఆర్‌ఎక్స్‌100'తో తనలోని నటనను, అందాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ఈ భామ ఇప్పుడు అనగనగా ఓ అతిథి చిత్రంలో డీగ్లామరస్‌ పాత్ర చేసింది. రవితేజ కథానాయకుడిగా నటించిన 'డిస్కోరాజా'లోనూ మాటలు రాని అమ్మాయిగా మెప్పించింది.

"నాలోని నటన సామర్థ్యాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలంటే డీ గ్లామర్‌ పాత్రలే ఉపయోగపడతాయి. అందుకే వాటిని అప్పుడప్పుడు చేస్తుంటా.. అలాగని గ్లామర్‌ పాత్రలను వదలుకోను" అంటోంది పాయల్‌. ప్రస్తుతం ఈ అమ్మడు '5డబ్ల్యూస్‌' చిత్రంలో నటిస్తోంది.

ఇదీ చూడండి :'ఖిలాడి'లో విలన్​గా యాక్షన్​కింగ్​ అర్జున్!

Last Updated : Dec 3, 2020, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details