Defamation case: ప్రముఖ నటుడు విజయ్ సేతుపతిపై పరువు నష్టం కేసు నమోదైంది. తమిళనాడు, చెన్నైకి సమీపంలోని సైదాపెట్కు చెందిన మహా గాంధీ అనే వ్యక్తి దావా వేశారు.
" వైద్య పరీక్షల కోసం వెళుతూ.. మైసూర్ విమానాశ్రయంలో విజయ్ సేతుపతిని అనుకోకుండా కలిశాను. సినీ రంగంలో ఆయన విజయాలకు మెచ్చుకున్నాను. కానీ, నా ప్రశంసలను తీసుకోలేదు. నన్ను అవమానించాడు. విమానాశ్రయంలోనే కులం పేరుతో దూషించాడు. అతని మేనేజర్‌తో నాపై దాడి చేయించాడు. ఆ మరుసటి రోజున తనపై దాడి జరిగిందిన కట్టుకథ అల్లాడు. విజయ్ సేతుపతి మేనేజర్ దాడి చేయటం వల్ల నా వినికిడి శక్తి కోల్పోయాను. " అని పిటిషన్లో పేర్కొన్నారు మహా గాంధీ అనే వ్యక్తి.