బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు తదుపరి చిత్రం 'ఇమాలి'. తొలుత ఈ సినిమాలో కంగన రనౌత్ నటిస్తుందని దర్శకుడు ప్రకటించాడు. కానీ కొన్ని కారణాల వల్ల కంగన తప్పుకుంది. అనంతరం ఇమాలిలో ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అగ్ర కథనాయిక దీపికా పదుకొణె ఈ చిత్రంలో నటించడానికి సిద్ధపడుతోందని కొన్ని రోజులుగా పుకార్లు వెల్లువెత్తుతున్నాయి.
ఈ పుకార్లపై సినిమా దర్శకుడు అనురాగ్ బసు స్పందించాడు. ఇమాలి కోసం దీపికను సంప్రదించినట్టు తెలిపాడు.