తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దీపికా అభినయాన్ని గుర్తుపట్టగలరా.! - దీపికా పదుకొణె

బాలీవుడ్​ నటి దీపికా పదుకొణె నటిస్తున్న చిత్రం ‘ఛపాక్‌’. ఈ సినిమాకి సంబంధించిన వీడియో ఒకటి  సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

దీపికా అభినయాన్ని గుర్తుపట్టగలరా.!

By

Published : Apr 10, 2019, 7:00 PM IST

ఛపాక్​ చిత్రంలో యాసిడ్​ బాధితురాలి​ పాత్రలో నటిస్తోంది దీపికా పదుకొణె. మేఘన గుల్జార్‌ దర్శకురాలు. ఈ​ చిత్రం షూటింగ్​ దిల్లీలో జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన చిన్నపాటి వీడియో నెట్టింట వైరల్​గా మారింది. హీరో విక్రాంత్‌తో కలిసి మార్కెట్‌లో బైక్‌పై తిరుగుతున్న దృశ్యం ఒకటి బయటికొచ్చింది. ఇందులో దీపికా అస్సలు గుర్తుపట్టలేనంతగా ఉంది. గతంలో చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ విడుదల చేసింది చిత్రబృందం. సంక్రాతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details