వెండితెరపై తన నటన, సోయగాలతో ప్రేక్షకులను కట్టిపడేయగల బాలీవుడ్ నటి దీపికా పదుకొణె. ఆమె చేసిన సినిమాలెన్నో బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించాయి. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్‌కు జోడీగా నటించేందుకు సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో దీపికను హీరోయిన్గా ప్రకటించింది చిత్రబృందం. అయితే, దీపిక ప్రతి సినిమాకు భారీ మొత్తంలో పారితోషికం తీసుకుందట. ఎంతలా అంటే.. బాలీవుడ్లో అత్యధికంగా సంపాదిస్తున్న నటిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సృష్టించింది. వీటితో పాటు ఆమె కెరీర్‌లోని మరెన్నో విశేషాలపై ఓ లుక్కేద్దాం రండి.
సంవత్సర ఆదాయం ఎంతంటే..
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ 2019 నివేదిక ప్రకారం దీపిక సంవత్సర ఆదాయం రూ. 112 కోట్లు. మరోవైపు ఫోర్బ్స్ ఇండియా పత్రిక ప్రచురించిన వాటిలో.. అత్యధిక సంపాదన కలిగిన భారతీయ సెలబ్రిటీల జాబితాలో పదుకొణె నాల్గవ స్థానంలో ఉంది. 2018లో దీపిక నటించిన 'పద్మావత్' చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమా రాజస్థాన్ మహారాణి పద్మావతి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ భామ హాలీవుడ్లో నటించిన 'త్రిబుల్ ఎక్స్' ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇందులో సెరెనా పాత్రలో నటించింది దీపిక.
సేవా తత్పరత..