తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దీపికా పదుకొణె 'మహాభారతం' ఆగిపోయిందా? - దీపికా పదుకొణె మహాభారతం న్యూస్

హిందీ బ్యూటీ దీపికా పదుకొణె నటించాల్సిన 'మహాభారతం' సెట్స్​పైకి వెళ్లకుండానే ఆగిపోయినట్లు సమాచారం. ఇంతకీ ఏం జరిగింది? ఏడాదిన్నర క్రితమే ప్రకటించినా ఇప్పటికీ మొదలవకపోవడానికి కారణమేంటి?

Deepika's ambitious film Mahabharat from Draupadi's point of view shelved?
దీపికా పదుకొణె 'మహాభారతం' ఆగిపోయిందా?

By

Published : Jan 19, 2021, 9:05 PM IST

బాలీవుడ్ నటి దీపికా పదుకొణె 'మహాభారతం' ఆగిపోయిందా! అంటే అవుననే బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దాదాపు ఏడాదిన్నర అవుతున్న సరే దర్శకుడి ఇంకా ఫైనల్​ కాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

2019 అక్టోబరులో 'మహాభారతం' సినిమా నిర్మించనున్నట్లు కథానాయిక దీపిక తెలిపింది. ఈ కథ ద్రౌపది ఆలోచనలకు అనుగుణంగా సాగుతుందని వెల్లడించింది. అయితే ఈ ప్రాజెక్టుకు ఎంతోమంది దర్శకుల పేర్లు పరిశీలించినా సరే ఎవరూ సెట్ కాలేదు. అదే సమయంలో దీపిక కూడా ఇతర ప్రాజెక్టులతో బిజీ అయిపోవడం వల్ల ఆ చిత్రాన్ని పక్కన పెట్టిసినట్లు తెలుస్తోంది. ఒకవేళ దర్శకుడు దొరికితే వెంటనే 'మహాభారతం' మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం '83', శకున్ బత్రా దర్శకత్వంలో ఓ సినిమా, ప్రభాస్-నాగ్ అశ్విన్ చిత్రాల్లో దీపికా పదుకొణె హీరోయిన్​గా నటిస్తోంది.

ఇవీ చదవండి:దీపిక ట్విట్టర్​, ఇన్​స్టా పోస్ట్​లు డిలీట్.. ఏమైంది?

ABOUT THE AUTHOR

...view details