తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నా యాసపై కామెంట్లు చేసినప్పుడు బాధేసింది: దీపిక - ఓమ్ శాంతి ఓమ్​ సినిమా వార్తలు

హీరోయిన్​గా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో తాను ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నట్లు వెల్లడించింది బాలీవుడ్​ నటి దీపికా పదుకొణె. 'ఓమ్​ శాంతి ఓమ్​' చేసిన తర్వాత తన యాసపై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని తెలిపింది.

Deepika Padukone was heartbroken when her accent was ridiculed in Om Shanti Om
నా యాసపై కామెంట్లు చేసినప్పుడు బాధేసింది: దీపిక

By

Published : Dec 28, 2020, 9:00 PM IST

Updated : Dec 28, 2020, 9:11 PM IST

బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​ 'ఓమ్​ శాంతి ఓమ్​' సినిమాతో దీపికా పదుకొణె హీరోయిన్​గా అరంగేట్రం చేసింది. తొలి సినిమా నుంచే ఎన్నో విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్నానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ విమర్శలే తన ఎదుగుదలకు కారణమయ్యాయని దీపిక పేర్కొంది.

"19 ఏళ్లప్పుడు (ఓమ్​ శాంతి ఓమ్​ చిత్రానికి) చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాను. అప్పటికి అంతగా అహగాహన లేదు. అప్పుడు షారుక్​​, ఫరా ఖాన్​ కొన్ని విషయాలను నేర్పించారు. ఆ సినిమా విడుదలైన తర్వాత నా పనితీరు పట్ల విమర్శలు ఎదుర్కొన్నాను. 'ఆమె ఓ మోడల్​. ఆమె నటించలేదు' అంటూ నా యాసపై కామెంట్లు చేశారు. ఆ మాటలు నన్ను చాలా బాధించాయి"

- దీపికా పదుకొణె, బాలీవుడ్​ నటి

విమర్శలు తనకు ఇంధనంలా పనిచేశాయని, దాని తర్వాత మరింతగా కష్టపడి, నాలోని నటనా నైపుణ్యాలను పెంచుకున్నానని పేర్కొంది.

దీపికా పదుకొణె.. చివకగా 'ఛపాక్​'లో నటించింది. '83'తో పాటు.. సిద్ధాంత్​ చతుర్వేదితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది.​ ప్రభాస్​, నాగ్​ అశ్విన్​ కాంబినేషన్​లో రూపొందుతున్న సినిమాలో ఈమె హీరోయిన్​గా ఎంపికైంది.

ఇదీ చూడండి:రెండు సెకన్ల సీన్‌కు.. అన్ని గంటల కష్టమా!

Last Updated : Dec 28, 2020, 9:11 PM IST

ABOUT THE AUTHOR

...view details