దీపికా పదుకొణె.. ఇటీవలే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన పేరు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రంలో నాయికగా ఎంపిక కావడమే ఇందుకు కారణం. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఆడిపాడబోయేది ఎవరా అనే ఉత్కంఠకు తెరదించుతూ ఈ అమ్మడి పేరు ప్రకటించారు దర్శక-నిర్మాతలు. దాంతో సినీ అభిమానుల్లో అంచనాలు పెరగడం మొదలైంది.
దీపిక టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో ఇవ్వాల్సింది! - దీపిక పదుకొణె
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాతో త్వరలోనే తెలుగు తెరకు పరిచయం కానుంది. అయితే ఈ ముద్దుగుమ్మకు గతంలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చింది. కానీ ఈమె నటించిన ఓ తెలుగు చిత్రం విడుదలకు నోచుకోలేకపోయింది. అదేంటో తెలుసుకుందాం.
![దీపిక టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో ఇవ్వాల్సింది! deepika](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10909737-1081-10909737-1615119606111.jpg)
దీపికా
హిందీలో గ్లామర్ పాత్రలు పోషిస్తూనే నాయికా ప్రాధాన్య చిత్రాల్లో నటించి శెభాష్ అనిపించుకున్న ఈ భామ తొలిసారి తెలుగు చిత్రం ఖరారు చేయడంతో అందరి చూపు ఆమెపై నిలుస్తోంది. అయితే గతంలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చింది దీపికకు. అనివార్య కారణాల వల్ల సాధ్యం కాలేదు. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన 'లవ్ 4 యు' చిత్రంలోని ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది దీపికా. అయితే ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు.
ఇదీ చూడండి: దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం