తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ధూమ్​ 4'లో విలన్​గా స్టార్ హీరోయిన్! - వరుస చిత్రాలతో బిజీగా ఉన్న దీపికా

దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన చిత్రం 'ధూమ్'. ఈ ఫ్రాంచైజీలో మరో చిత్రం రానున్న నేపథ్యంలో విలన్​ పాత్ర కోసం చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం 'ధూమ్ 4' కోసం యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్.. ఓ స్టార్​ నటిని విలన్​గా​ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

Deepika Padukone in Dhoom 4?
'ధూమ్​ 4'లో విలన్​గా ఆ బాలీవుడ్ భామ!

By

Published : Jan 3, 2021, 8:44 PM IST

జాన్​ అబ్రహం, హృతిక్​ రోషన్​, ఆమిర్​ ఖాన్​ వంటి దిగ్గజ నటులను విలన్​ పాత్రల్లో చూపిన 'ధూమ్' సిరీస్​ కొత్త సీక్వెల్​తో మరో ప్రయోగం చేయబోతోంది. ఈ ఫ్రాంచైజీలో రానున్న నాలుగో చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణెను విలన్​గా చూపించనున్నట్లు సమాచారం. ఇందుకోసం యశ్ రాజ్ ఫిలింస్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

'ధూమ్​ 4'లో విలన్ పాత్ర పోషించాలని నిర్మాణ సంస్థ దీపికను కోరిందట. అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్నా.. ఈ చిత్రంలో నటించేందుకు దీపిక ఆసక్తితో ఉన్నట్లు తెలిసింది.

దీపికా పదుకొణె

ఈ సీక్వెల్​లో నటిస్తే.. దీపికా పదుకొణె మొత్తం కెరీర్​లో నెగటివ్​ పాత్ర పోషించే మొదటి సినిమా ఇదే కానుంది. ప్రస్తుతం ఈ బాలీవుడ్​ భామ వరుస చిత్రాలతో బిజీగా ఉంది. శకున్ బత్రా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓ చిత్రంలో సిద్ధాంత్ చతుర్వేది, అనన్యా పాండేలతో కలిసి నటిస్తోంది. ప్రభాస్​ కథానాయకుడుగా తెరకెక్కనున్న పాన్ ఇండియా చిత్రంలోనూ దీపికా హీరోయిన్​గా చేస్తోంది. అట్లీ దర్శకత్వంలో రానున్న ఓ సినిమాలో ఈ నటి ప్రధాన పాత్ర పోషించనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి:కుటుంబంతో హైదరాబాద్ వచ్చిన ఐష్

ABOUT THE AUTHOR

...view details