మంచైనా, చెడైనా తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై కచ్చితంగా పడుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషిస్తారు. కొందరు తాము ఉన్న రంగంలోనే పిల్లలు రావాలని అనుకుంటారు. మరికొందరు వారికి స్వేచ్ఛనిచ్చి, వారికిష్టమైన ఫీల్డ్‌లో రాణించేందుకు ప్రోత్సాహం అందిస్తారు. అయితే ప్రస్తుతం భారతీయ సినిమాల్లో రాణిస్తున్న పలువురు సినీ స్టార్ తండ్రులు.. ఆటల్లో ఆకట్టుకున్న వాళ్లు ఉన్నారు. ఇంతకీ వాళ్లెవరు? ఇప్పుడు వారి పిల్లలు ఏం చేస్తున్నారు?
దీపికా పదుకొణె
బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో దీపికా పదుకొణె టాప్‌లో ఉంటుంది. బెంగళూరులో మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన ఆమె.. తన కృషితో ఈ స్థాయికి ఎదిగింది.
తండ్రి ప్రకాశ్ పదుకొణెతో దీపికా దీపిక తండ్రి ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొణె. ఆయన ఇంగ్లాండ్ ఓపెన్ట్రోఫీ గెలుచుకున్న అతికొద్ది మంది ఇండియన్స్ షట్లర్లలో ఒకరు. అయితే దీపిక.. మోడలింగ్‌లోకి రాకముందు బ్యాడ్మింటన్ ఆడేది. కానీ ఆ తర్వాత సినిమాల్లో సెటిల్ అయిపోయింది. ఆమె భర్త రణ్వీర్ సింగ్ కూడా బాలీవుడ్లో అగ్రహీరో.
సారా తెందూల్కర్
దిగ్గజ సచిన్ తెందూల్కర్.. ఈ పేరు తెలియని వారు ఉండరు! అలాంటి సచిన్ కుమార్తె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏం రంగంలోకి వెళ్తుంది అని అభిమానులు అందరూ అనుకున్నారు. కానీ ఆమె మోడలింగ్‌లోకి అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈమె సోదరుడు అర్జున్ మాత్రం నాన్న బాటలోనే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు.
సారా తెందూల్కర్‌తో సచిన్ విందు దారా సింగ్
ప్రముఖ రెజ్లర్ దారాసింగ్. ఆయన కుమారుడు విందు దారాసింగ్ మాత్రం నటుడిగా స్థిరపడ్డారు. చాలా సినిమాలు, టీవీ సీరియల్స్ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్‌బాస్ మూడో సీజన్లో విజేతగా నిలిచారు. సోనీ టీవీలో ప్రసారమైన 'లార్డ్ హనుమాన్' సీరియల్లో ఆంజనేయుడి పాత్రలో నటించి, అభిమానుల్ని విందు మెప్పించారు.
సైఫ్-సోహ అలీ ఖాన్
బాలీవుడ్లో ప్రముఖ నటుల్లో సైఫ్ అలీ ఖాన్. ఇతడి సోదరి సోహ అలీఖాన్ కూడా పలు సినిమాల్లో నటించింది. అయితే వీరి తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ.. ప్రముఖ క్రికెటర్, తల్లి షర్మిలా ఠాగూర్ నటి. తండ్రి బాటలో కాకుండా తల్లిలా పిల్లలిద్దరూ యాక్టింగ్‌లో రాణించారు.