తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'క్రిష్​ 4'లో హృతిక్​తో దీపికా రొమాన్స్..! - deepika padukone hrithik roshan

బాలీవుడ్​లో సూపర్​ హీరో నేపథ్యంలో వచ్చిన 'క్రిష్​' చిత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా సీక్వెల్స్​ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్నే రాబట్టాయి. తాజాగా ఈ ఫ్రాంఛైజీలో 'క్రిష్​ 4' త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్​గా దీపికా పదుకొణెను తీసుకోబోతున్నట్లు సమాచారం.

deepika
దీపికా

By

Published : Jan 27, 2020, 7:11 PM IST

Updated : Feb 28, 2020, 4:24 AM IST

బాలీవుడ్‌ సూపర్‌హీరో హృతిక్‌ రోషన్‌ నటించిన 'క్రిష్‌' చిత్రం అప్పట్లో ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'క్రిష్‌2', 'క్రిష్‌3'లు ప్రేక్షకులను మెప్పించాయి. తాజాగా హృతిక్‌ తండ్రైన రాకేష్‌ రోషన్‌ దర్శకత్వంలో తెరకెక్కే 'క్రిష్‌4'లో కథానాయికగా దీపికా పదుకొణె నటించనుందని సమాచారం. గతంలో వచ్చిన సీక్వెల్‌ చిత్రాల్లో ప్రియాంక చోప్రా హీరోయిన్​గా నటించి మెప్పించింది.

రాకేష్‌ రోషన్‌ తన 'క్రిష్‌4'లో దీపికా పదుకొణెను కథానాయికగా తీసుకోవడానికి మొగ్గుచూపుతున్నాడట. అయితే ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. ఇప్పటి వరకు దీపికా - హృతిక్‌లు కలిసి నటించిన చిత్రం ఒక్కటీ కూడా లేదు. అందుకే హృతిక్‌ - దీపికాల కాంబినేషన్‌ ఒక్కసారైనా తెరపై చూడాలని బాలీవుడ్‌ ప్రేక్షకులు కోరుకుంటున్నారట.

హృతిక్‌ గతేడాది 'సూపర్‌ 30', 'వార్‌'లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి ఈ ఏడాదిలో ఎటువంటి కొత్త ప్రాజెక్ట్‌ను చేపట్టలేదు. దీపికా తన భర్త రణ్​వీర్ సింగ్‌తో కలిసి '83'లో నటిస్తోంది. ఈ చిత్రం తరువాత దీపికా కూడా కొత్త చిత్రాలు చేస్తున్నట్లు సమాచారం లేదు.

ఇవీ చూడండి.. అలాంటి కథ దొరికితే బన్నీ బాలీవుడ్ ఎంట్రీ..!​

Last Updated : Feb 28, 2020, 4:24 AM IST

ABOUT THE AUTHOR

...view details