తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మరో మూడు రోజుల్లో ఫ్యాన్స్​కు దీపిక సర్​ప్రైజ్​! - deepika news updates

షకున్​ బాత్రా దర్శకత్వంలో బాలీవుడ్​ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె నటిస్తోంది. ఇటీవలే సెట్స్​లోకి అడుగుపెట్టిన దీపిక.. మరో మూడు రోజుల్లో సర్​ప్రైజ్​ ఇవ్వబోతున్నామంటూ ఇన్​స్టాలో వెల్లడించింది.

Deepika
దీపిక

By

Published : Sep 19, 2020, 1:01 PM IST

బాలీవుడ్​ హీరోయిన్​ దీపికా పదుకొణె ప్రధాన పాత్రలో దర్శకుడు షకున్​ బాత్రా ఓ సినిమా తెరెక్కిస్తున్నాడు. ఈ షూటింగ్​ కోసం ఇప్పటికే దీపిక సెట్స్​లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే ఇన్​స్టాగ్రామ్ వేదికగా దీపిక షేర్ చేసిన ఓ పోస్ట్​ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరో మూడు రోజుల్లో సర్​ప్రైజ్​ ఇవ్వబోతున్నామంటూ అభిమానులతో పంచుకుందీ భామ. కాగా సినిమాలో నటించేవారి గురించి తప్ప.. ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎటువంటి సమాచారం లేదు. దీంతో ఆ సర్​ప్రైజ్​ ఏంటా అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దీపిక పోస్ట్​

ఈ ఏడాది పారంభంలో 'ఛపాక్'​ చిత్రంలో విభిన్న పాత్ర పోషించి అలరించింది దీపిక. ఆమె భర్త రణ్​వీర్​ సింగ్​ నటించిన '83'లో కూడా కనిపించనుంది. నాగ్​ అశ్విన్​ దర్శకత్వంలో ప్రభాస్​ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలోనూ నటించనుంది.

ABOUT THE AUTHOR

...view details