Deepika Padukone Prabhas Movie: స్టార్ హీరో ప్రభాస్ సెట్స్‌లో చాలా ప్రశాంతంగా ఉంటారని చెప్పింది బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె. ఇటీవల రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగిన 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిందీ ముద్దుగుమ్మ. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకొని తిరిగి ముంబయి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ ప్రభాస్‌తో పనిచేయడంపై తన అనుభవాన్ని తెలుపుతూ... ఈ విషయాన్ని చెప్పింది.
"తొలి రోజు షూట్లో మేం మాట్లాడుకున్నాం. ప్రభాస్ చాలా కామ్‌గా ఉంటారు. ఆయన సెట్స్‌కు వచ్చినట్లు కూడా అక్కడి చాలా మందికి తెలీదు. ప్రశాంతంగా ఓ మూల కూర్చొని షూటింగ్‌ను గమనిస్తూ ఉంటారు" అని దీపిక అన్నారు.