ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణె 'మామీ' (ముంబయి అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్) చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసింది. వరుస సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండడం వల్ల తాను వేరే బాధ్యతలపై దృష్టి సారించడానికి సమయం సరిపోవడం లేదని ఆమె తెలిపింది. ఈ మేరకు తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ పోస్ట్ పెట్టింది.
"మామీ' బోర్డులో సభ్యురాలిగా ఉన్నందుకు, చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించినందుకు ఎంతో గర్విస్తున్నా. ఒక నటిగా ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది టాలెంట్‌ని గుర్తించి ముంబయికి తీసుకురావడం ఆనందాన్ని ఇచ్చింది. అయితే, ప్రస్తుతం వృత్తిపరమైన జీవితంలో నేను బిజీగా ఉన్నాను. దానివల్ల 'మామీ'కి పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నా. దాంతో నేను పదవీ బాధ్యతల నుంచి వైదొలగుతున్నా. 'మామీ'తో నాకున్న అనుబంధం విడదీయరానిది."