తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రిలేషన్​షిప్​ డ్రామాలో హీరోయిన్ దీపికా పదుకొణె - ఛపాక్​లో హీరోయిన్ దీపికా పదుకొణె

రిలేషన్​షిప్ నేపథ్య కథాంశంతో రూపొందే కొత్త సినిమాలో దీపికా పదుకొణె ప్రధాన పాత్ర పోషించనుంది. సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

రిలేషన్​షిప్​ డ్రామాలో హీరోయిన్ దీపిక పదుకొణె
హీరోయిన్ దీపికా పదుకొణె

By

Published : Dec 19, 2019, 10:16 AM IST

Updated : Dec 19, 2019, 10:24 AM IST

బాలీవుడ్ ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్​ జోహార్.. మరో ఆసక్తికర కాంబినేషన్​ సెట్​ చేశాడు. స్టార్ హీరోయిన్​ దీపికా పదుకొణె- యువ నటుడు సిద్ధాంత్ చతుర్వేది- కథానాయిక అనన్య పాండే.. ఇందులో కలిసి నటించనున్నారు. రిలేషన్​షిప్ నేపథ్యంగా సాగే కథతో ఈ చిత్రం తీయనున్నారు. 'కపుర్ అండ్ సన్స్' ఫేమ్ శకున్ బత్రా దర్శకత్వం వహించనున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుకానుంది. 2021 వాలంటైన్స్ డే కానుకగా విడుదల కానుంది.​

దీపికా పదుకొణె-సిద్ధాంత్ చతుర్వేది-అనన్య పాండే-శకున్ బత్రా

సిద్ధాంత్.. ఇటీవలే ఓ కొత్త సినిమా ప్రకటించాడు. ఇప్పుడీ చిత్రంలో నటించనున్నాడు. మరోవైపు దీపిక.. 'ఛపాక్'లో యాసిడ్ బాధితురాలిగా కనిపించనుంది. ఇటీవలే వచ్చిన ట్రైలర్​ ఆకట్టుకుంటోంది. వచ్చే నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ఇది చదవండి: 'ఛపాక్' ట్రైలర్​ చూస్తూ భావోద్వేగం.. దీపిక కన్నీటి పర్యంతం

Last Updated : Dec 19, 2019, 10:24 AM IST

ABOUT THE AUTHOR

...view details