Deepika Padukone corona: ప్రస్తుతం కరోనా మళ్లీ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వైరస్ బారిన పడుతున్నారు. వీరిలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె కూడా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గన్న ఈ ముద్దుగుమ్మ.. కరోనాతో పోరాడిన పరిస్థితులను గుర్తు చేసుకున్నారు.
"కరోనా తర్వాత నా జీవితమే మారిపోయింది. ఎందుకంటే వైరస్ బారిన పడ్డాక నా శరీరంలో చాలా మార్పులొచ్చాయి. నేను వేసుకున్న మందులు, తీసుకున్న స్టెరాయిడ్స్ వల్లేమో.. గుర్తుపట్టలేనంతగా మారిపోయాను. కొవిడ్ చాలా భయంకరమైనది. అది సోకినప్పుడు పెద్దగా భయమనిపించలేదు. కానీ కోలుకున్న తర్వాత నా మెదడు అసలు పని చేయలేదు. దీంతో రెండు నెలల పాటు షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చాను. అది నా జీవితంలో క్లిషమైన దశ" అని దీపిక పేర్కొన్నారు.