దీపావళి ముగిసి వారం రోజులైనా ఇంకా పండుగ వేడుకల్లోనే మునిగి తేలుతోంది బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకుణె. పోస్ట్ దివాళి సెలబ్రేషన్స్ అంటూ(దీపావళి తర్వాత వేడుక) కొన్ని ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. చిన్నతనంలోని వివిధ జ్ఞాపకాలను పంచుకుంది దీపికా.
ఈ పిక్చర్లు చూసిన అభిమానులు విశేషంగా స్పందిస్తున్నారు. చిన్నప్పుడు దీపిక ఫొటోను చూసిన ఓ అభిమాని 'త్వరలో శుభవార్త చెప్పబోతున్నారా' అని కామెంట్ పెట్టాడు. మరికొందరు అభినందనలు తెలిపారు.